Choodu Nanna Lyrics in Telugu Lyrics - Vijaynarain

Choodu Nanna Lyrics in Telugu Lyrics - Vijaynarain


Choodu Nanna Lyrics in Telugu
Singer Vijaynarain
Composer Santhosh Narayanan
Music Santhosh Narayanan
Song WriterBhaskara Bhatla

Lyrics

Choodu Nanna Lyrics in Telugu



చూడు నాన్న చూస్తున్నావా నాన్నా

నీడ లేని నేనా, వీళ్ళ ధీమా

ఏమిటీ ఇంతటి ప్రేమా



 



నా దారెటో తోచకుంటే

నీ వెంబడే మేము అంటూ

కదిలారు ఏంటో… ఆ నమ్మకం

నేనెలా ఒడ్డుకి చేరడం

వీళ్ళనెలా ఒడ్డుకి చేర్చడం



ఇంటి పెద్దా కన్నుమూస్తే

అయినవాళ్ళు అందలే కదా

నువ్వే లేకా ప్రతి ఊరు ఊరు

అనాధ అవ్వడం ఏందయ్యా

ఇది ఏనాడు జరిగుండదయ్యా ఓ పెద్దయ్యా



ఇందరి కన్నులు చిమ్మే కన్నీటినంతా

తుడవాలనుంది కొడుకుగా

అందుకు అవసరమయ్యే

కొండంత ధైర్యం నాకు ఇవ్వవా



నేనెలా బాధని మింగడం

వీళ్ళనెలా నే ఓదార్చడం



 



ఎంతలా అభిమానం కురిపిస్తున్నారో ఈ జనం

అందుకే ఈ జన్మలో తీర్చేసుకుంటా ఈ రుణం

గడపకి ప్రతి గడపకి నేనవుతా రక్షా తోరణం

మాటపై ఉంటానని చేస్తున్నా తొలి సంతకం



చూడు నాన్న… చూడు నాన్న

చూడు నాన్న… చూడు నాన్న

చూడు నాన్న… చూడు నాన్న

చూడు నాన్న… చూడు నాన్న




Choodu Nanna Lyrics in Telugu Watch Video

Comments